Reading Time: < 1 minute
‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా రికార్డ్.. కానీ ఒక్క రూపాయి కూడా అందుకోని శాంసన్.. ఎందుకో తెలుసా?

Why ICC don’t give money to player of the tournament: ఏ ఆటగాడిని అయితే టీమిండియా మొదటి నాలుగు మ్యాచ్‌ల వరకు బెంచ్‌కే పరిమితం చేసిందో, ఏ ఆటగాడి ప్రతిభపై ప్రపంచం మొత్తం ప్రశ్నలు కురిపించిందో.. అదే ఆటగాడు ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2026 కు హీరోగా నిలిచాడు. సంజూ శాంసన్ తన అసాధారణ బ్యాటింగ్‌తో భారత్‌ను మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడమే కాకుండా, టోర్నీలోనే అత్యుత్తమ ఆటగాడిగా (Player of the Tournament) ఎంపికయ్యాడు.

సంజూ శాంసన్ విధ్వంసం – గణాంకాలు:

టోర్నీ మధ్యలో జట్టులోకి వచ్చిన సంజూ, కేవలం 5 మ్యాచ్‌ల్లోనే అద్భుతాలు సృష్టించాడు.

మొత్తం పరుగులు: 5 మ్యాచ్‌ల్లో 321 పరుగులు.

సగటు & స్ట్రైక్ రేట్: 80.2 సగటు, 199.37 స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడ్డాడు.

రికార్డులు: వరుసగా మూడు అర్ధసెంచరీలు సాధించి కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. టోర్నీలో అత్యధికంగా 24 సిక్సర్లు బాదాడు.

వరల్డ్ రికార్డ్: వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాది ఇన్నింగ్స్ ప్రారంభించిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

కీలక ఇన్నింగ్స్‌లు:

వెస్టిండీస్‌పై 97 (నాటౌట్), సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 89, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

అవార్డు వచ్చినా డబ్బు ఎందుకు రాలేదు?

సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికైనప్పటికీ, అతనికి ఐసీసీ (ICC) నుంచి ఎటువంటి నగదు బహుమతి అందలేదు. దీనికి కారణం ఐసీసీ నిబంధనలు. ఐసీసీ తన అధికారిక అవార్డుల కింద ఆటగాళ్లకు కేవలం జ్ఞాపికలు (ట్రోఫీలు) మాత్రమే అందజేస్తుంది. నగదు ఇవ్వదు. ఒక క్రికెటర్‌కు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందుకోవడం అనేది నగదు కంటే గొప్ప గౌరవంగా భావిస్తారు.

సంజూ ఎమోషనల్ కామెంట్స్:

అవార్డు అందుకున్న తర్వాత సంజూ మాట్లాడుతూ.. “నా కల నెరవేరింది. 2024 వరల్డ్ కప్ నుంచి నేను ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. మధ్యలో నా ఫామ్ కోల్పోయినప్పుడు అసలు జట్టులోకి వస్తానో లేదో అని భయపడ్డాను. కానీ దేవుడి దయ వల్ల నాకు అవకాశం దక్కింది, ఈ అద్భుతం జరిగింది” అని ఉద్వేగానికి లోనయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..