Reading Time: < 1 minute
Us Israel Ground Operation Iran Uranium Seizure Trump

Iran War: అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం కొత్త టర్న్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోకి ప్రత్యేక దళాలను పంపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్స్ చేయాలని ఇజ్రాయిల్, యూఎస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్‌లో ఎన్‌రిచ్ యురేనియం నిల్వల్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ సైనిక ఎంపిక గురించి చర్చించడం ప్రారంభించాయి. ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల 60 శాతం ఎన్‌రిచ్ యురేనియం స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ఉండే అవకాశం ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు సంపాదించడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. 60% సమృద్ధమైన యురేనియంను చాలా తక్కువ సమయంలోనే 90%కి పెంచవచ్చని నిపుణులు అంటున్నారు.అణ్వాయుధాన్ని నిర్మించడానికి అవసరమైన స్థాయిగా ఇది పరిగణించబడుతుంది. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ ఈ నిల్వను ఒక పెద్ద ముప్పుగా భావిస్తున్నాయి.

Read Also: Kamal Haasan:రోజుకు రూ. 15 కోట్లా? ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ హీరో ఎవ్వరో తెలుసా..!

ఒకవేళ ఈ మిషన్ ప్రారంభమైతే అమెరికన్, ఇజ్రాయిల్ దళాలు ఇరాన్ నెలపై దిగాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వైమానిక దాడులు మాత్రమే చేపడుతున్న సమయంలో, గ్రౌండ్ ఆపరేషన్స్ మొదలైతే యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే అవకాం ఉంది. ఇరాన్ సైన్యం ద్వారా తమ సైనికులకు ఎలాంటి ఆపద లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఈ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉంది. ఇరాన్‌లో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ సమావేశంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో మాట్లాడుతూ.. ఇరాన్ వెళ్లి యురేనియాన్ని పొందాల్సిందే అని అన్నారు.

సైనిక చర్య గురించి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీవ్రంగా చర్చిస్తున్నట్లు ఇజ్రాయిల్ రక్షణ అధికారి తెలిపారు. ఈ మిషన్‌లో ప్రత్యేక దళాలతో పాటు అణు శాస్త్రవేత్తలు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) నుండి నిపుణులు కూడా ఉండవచ్చు. పెద్ద ఎత్తున భూ బలగాలను మోహరించే ప్రణాళికలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇది యుద్ధం లాంటి పెద్ద ఆపరేషన్ కాదు, చిన్న అత్యంత ఖచ్చితమైన ప్రత్యేక ఆపరేషన్‌గా చెబుతున్నారు.