Reading Time: < 1 minute

పాక్లో వర్క్ ఫ్రం హోం! వార్ కారణంగా పెట్రోల్ కొరతతో కేబినెట్ నిర్ణయం

Caption of Image.

ఇస్లామాబాద్: పాకిస్తాన్​లో కేవలం 26 రోజులకు మాత్రమే పెట్రో నిల్వలున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మీదుగా పెట్రోల్ రవాణా సాగడం లేదు. సౌదీ అరేబియాకు మిత్ర దేశంగా ఉన్న పాకిస్తాన్ కు పెట్రోలు రావడం అంత ఈజీగా కనిపించడం లేదు. ప్రస్తుతం పాకి స్తాన్ వద్ద ఐదు లక్షల టన్నుల పెట్రో, డీజిల్ నిల్వలు ఉన్నాయి. ఇవి 20 నుంచి 26 రోజులకు సరిపోతాయి. 

యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తుండడంతో 18 మంది సభ్యులతో కూడిన కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ కేంద్ర కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలోనే ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి.  

©️ VIL Media Pvt Ltd.