Reading Time: < 1 minute

భద్రాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. హైవేపై రెండు లారీలు ఢీ

Caption of Image.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ – జగదల్పూర్ జాతీయ రహదారిపై  రెండు లారీలు ఢీకొన్నాయి.  ఒక లారీ డ్రైవర్ మృతి చెందగా..మరో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.ఈ  ఘటనలో రెండు లారీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనతో 

మార్చి 6న తెల్లవారు జామున విజయవాడ – జగదల్పూర్ జాతీయ రహదారిపై  ఎదురెదురుగా వచ్చిన  రెండు లారీలు ఢీ కొనడంతో  డ్రైవర్లు ఇద్దరూ క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చండ్రుగొండ పోలీసులు ఘటన స్థలానికి వచ్చారు. స్థానికుల సహాయంతో ఇరు డ్రైవర్లను అతి కష్టం మీద బయటకు తీసి 108 ద్వారా కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ రామ్మూర్తి మృతి చెందాడు. ఒక లారీ తమిళనాడుకు చెందినది మరోలారి చత్తీస్ ఘడ్  రాష్ట్రానికి చెందినది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.