Reading Time: < 1 minute

వాషింగ్టన్: ఇరాన్ సైనిక నాయకత్వం, కీలక రక్ష ణ సామర్థ్యాలు నిర్వీర్యం అయ్యాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మంగళవారం నాడు ప్రకటించారు. ఈ తరుణంలో ఇరాన్‌తో చర్చలకు చాలా ఆలస్యం అ యిందని, ప్రస్తుతానికి చర్చల ప్రసక్తి లేదని ఆయన స్ప ష్టం చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ చర్చల పై ప్రచురించిన ఓ వ్యాసాన్ని ఆయన తిరస్కరించారు. ఇరాన్ సై న్యం, రక్షణ వ్యవస్థ వైమానిక దళం, నావికా దళం, నాయకత్వం అన్నీ దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో వారు సంప్రదింపులకు సిద్ధమయ్యారని, అయితే అందుకు చాలా ఆల స్యం అయిందని స్పష్టం చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికావద్ద అపరమితమైన ఉన్న త స్థాయి, మధ్య స్థాయి ఆయుధ సంపత్తి, విధ్వంసకర ఆయుధ బలం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం నాల్గో రోజులో ప్రవేశించింది. ఇప్పట్లో విరామం సూచనలు కన్పించడం లే దు. అమెరికా వైమానిక దళం సోమవారం రాత్రి ఇరా న్‌లోని కీలకమైన ప్రభు త్వం కార్యాలయాలు, భవనాలపై దాడి చేసింది. వాటిలో ప్రెసిడెంట్ భవన సముదాయం, దేశ అత్యున్నత భద్రతా సంస్థ కార్యాలయ భవనం కూడా ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ ఇజ్రాయెల్ పైన, గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులపై పెద్దఎత్తున దాడులకు పూ నుకుంది. శనివారం ఇరాన్ ను అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసిన తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంబించింది. అప్ప టి నుంచి సరిహద్దుల్లోని గల్ఫ్ దేశాలపై డ్రోన్లు విరుచుకుపడుతున్నాయి.