Reading Time: < 1 minute

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును వెనుక నుండి ఎపి ఎస్ఆర్టిసి బస్సు ఢీకొంది. దాదాపు 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎపి ‌లోని నిడదవోలు నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.