
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. సంజూ శామ్సన్ అద్బుతమైన బ్యాటింగ్ చేయడంతో భారత జట్టు గెలుపొండంతో సెమీ ఫైనల్ కు చేరుకుంది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సంజూ 50 బంతుల్లో 97 పరుగులు చేసి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. డూ ఆర్ డై మ్యాచ్ లో సంజూ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో క్రికెట్ అభిమానులు సంజూ నామస్మరణంలో మునిగితేలుతున్నారు. క్రికెట్ తో పాటు సినిమాలపై ఉన్నా తన ఇష్టాలను సంజు శామ్సన్ మీడియాతో పంచుకున్నాడు.
టాలీవుడ్ లో తనకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని చెప్పాడు. అల్లు అర్జున్ సినిమాల్లో మాస్, ఎనర్జీ, డ్యాన్స్ ఉంటుందని అందుకే తనకు నచ్చతుందన్నారు. మలయాళీలో ఎక్కువగా సంజూ సినిమాలు చూస్తానని చెప్పాడు. అల్లు అర్జున్ తో పాటు మహేష్ బాబు అంటే కూడా తనకు ఇష్టమని, ఆయన సినిమాలు చూసి కూడా బాగా ఎంజాయ్ చేస్తానని సంజూ పేర్కొన్నాడు. మహేష్ బాబు స్టైల్ తో స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుందని చాలా క్లాస్ ఉంటాడని చెప్పాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన డైహార్డ్ ప్యాన్ అని సంజూ స్పష్టం చేశారు. రజనీ నటించిన అరుణాచలం మూవీలోని డైలాగ్స్ చెప్పి నవ్వులు పూయించాడు. గతంలో మహేష్ బాబుకు సంజు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు కూడా సంజూ ప్రశంసించిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియా సినిమా గ్లోబల్ స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు.