Reading Time: 2 minutes

అమెరికా-ఇజ్రాయెల్ ఛాడుల్లో సుప్రీం లీడర్ మృతి 

36 ఏళ్లుగా ఇరాన్‌ను శాసించిన ఖమేనీ దాడులలో ఖమేని అల్లుడు, కుమార్తె, మనుమరాలు

మృతి కీలక ఆర్మీచీఫ్‌లు సహా 50 మంది వరకు హతం ధ్రువీకరించిన ఇరాన్

40 దినాలు సంతాపం ప్రకటించిన ఇరాన్ కేబినెట్ ఆగ్రహంతో రగిలిపోయిన ఇరాన్

రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడి ప్రకటన ఇరాన్‌లో

ఖమేనీ మద్దతు దారుల రోదనలు, నిరసన వ్యతిరేకుల సంబురాలు

టెహ్రాన్/దుబాయి : ఇరాన్‌ను 36 ఏళ్లుగా శాసించిన సు ప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ శకం ముగిసింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దా డులలో ఇరాన్ సుప్రీం లీడర్ శనివారంనాడు మరణించారు. 86 సంవత్సరాల ఖమేనీ మరణించిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. వైమానిక దాడులలో ఖమేనీ అల్లు డు, కుమార్తె, మనుమరాలు కూడా మరణించార ని ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఖమేనీ అత్యుతన్నత స్థాయి సలహాదారుతో పాటు ఏడుగురు కీలక ఆర్మీ చీఫ్‌లు ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. సుమారు 50మంది వరకు అత్యున్నత స్థాయి అధికారులు ఈ దాడుల్లో మృత్యువాత పడ్డట్లు ఇరాన్ వెల్లడించింది. వీరిలో రక్షణమంత్రితో పాటు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ చీఫ్ కూడా ఉన్నారు. ఖమేనీ మృతి నేపథ్యంలో ఇ రాన్ 40 రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది.

సుప్రీంలీడర్ మరణవార్త కార్చిచ్చులా వ్యాపించడంతో ఇరాన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఖమేనీ మృతికి తీవ్రస్థాయిలో జవాబు ఇస్తామని ఇరాన్ కేబినెట్ ప్రకటించింది. హంతకులపై తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. ఒకపక్క విపరీతంగా కురుస్తున్న బాంబుల వర్షం మధ్య కొన్ని వర్గా ల ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోగా, పెద్ద ఎ త్తున ప్రజలు, మహిళలు కన్నీళ్లు పెట్టారు. అయతుల్లా అలీఖమేనీ మద్దతుదారులు గుమికూడి సంతాపం ప్రకటించారు. ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అరాఫీ వ్యవహరిస్తారని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. అరాఫీ ప్రస్తుతం అసెంబ్లీ నిపుణుల కమిటీ డిప్యూటీ చైర్మన్ గా ఇరాన్ సెమినరీ సిస్టమ్ హెడ్ గా ఉన్నారు.

విప్లవంలో కీలక పాత్ర…

ఆయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ మతాధికారి, రాజకీయవేత్త,1939 ఏప్రిల్ 19న ఇరాన్ లో ఓ పేద కుటుంబంలో జన్మించిన అలీ ఖమేనీ, గతంలో 1981 నుంచి 1989 వరకూ ఇరాన్ అధ్యక్షుడుగా పని చేశారు. 1989 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకూ ఇరాన్ సుప్రీం లీడర్ గా దేశాన్ని శాసించారు. పశ్చిమాసియాలో ఎక్కువకాలం పనిచేసిన ఇరాన్ రాజు, షా మొహమ్మద్ రెజా పహ్లావి తర్వా త చాలా కాలం ఇరాన్‌ను శాసించినది ఆయతుల్లా అలీ ఖమేనినే. 1978-79 ఇరానియన్ విప్లవంలో ఖమేనీ కీలక పాత్రవహించారు.విప్లవం విజయవంతం కావడంతో కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లో పలు కీలక పదవులు నిర్వహించారు. ఇజ్రాయెల్ నుంచి ఆయన ఎన్నోసార్లు హత్యకు సంబంధించి పలు బెదిరింపులు ఎదుర్కొన్నారు. 1989లో తొలి సు ప్రీంలీడర్ ఆయతుల్లా రొహల్లా ఖొమేని తర్వాత అలీ ఖమేనీ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. 2026 ఫిబ్రవరి 28న అమెరికా -ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో జరిగిన భీకర దాడులలో ఖమేని మరణించడంతో ఇరాన్ ప్రభు త్వం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జిసి) సమావేశమై ఈ హత్యకు కారణమైన హంతకులపై చరిత్రలో కనీవినీ ఎరుగనంత భీకరంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిక్ష చేశారు. హంతకులు సుప్రీం లీడర్ ప్రతి నెత్తుటి బొట్టుకు తగిన మూ ల్యం చెల్లించుకోకతప్పదని ఇరాన్ కేబినెట్ అధికారికంగా ప్రకటించడం విశేషం.

ట్రంప్ ప్రకటన..

ఇరాన్ సుప్రీం లీడర్ పై దాడిని తామే నిర్వహించామని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సం చలన ప్రకటన చేశారు. సోషల్ మీడియా ట్రూత్ లో ట్రంప్ ఓ ప్రకటన చేస్తూ, ఇజ్రాయెల్ తో కలిసి తాము అత్యంత పకడ్బిందీగా నిర్వహించిన ఆపరేషన్ పూర్తయిందని, తమ అత్యాధునిక నిఘా నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని ట్రంప్ అన్నారు. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే ఇరా న్ ప్రతీకారదాడులకు దిగింది.

ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ఖతర్, యుఏఈ, బహ్రెయిన్, కువై ట్‌లపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఒమన్ మధ్యవర్తిత్వంలో జనీవాలో జరిగిన చర్చలు విఫలమైన 48 గంటలలోపే ఇరాన్‌పై దాడి జరగడం గమనార్హం. 

ఖమేనీ మరణవార్త చదువుతూ

వెక్కి వెక్కి ఏడ్చిన టివి యాంకర్

టెహ్రాన్ : అమెరికా, ఇజ్రాయెల్ జాయిం ట్ ఆపరేషన్‌లో ఇరా న్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖుమేనీ మరణించిన వార్త చ దువుతూ ఇరాన్ టీవీ యాంకర్ కన్నీళ్లు పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చా డు. వార్త చదువుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. దేవుడు గొప్పవాడు. ఇస్లామిక్ విప్ల వం అత్యున్నత నాయకుడు గ్రాండ్ ఆయతు ల్లా అలీ ఖమేనీ శనివారంనాడు అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా చేసిన నేరపూరిత దాడిలో అమరులయ్యారని దేశప్రజలకు అ త్యంత దుఃఖంతో ప్రకటిస్తున్నాము అని ఖ మేనీ మరణవార్త ప్రకటిస్తూ యాంకర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దుఃఖంతో గొంతు పూడుకు పోయింది.న్యూస్ రీడర్ ఖమేనీ మరణవార్తను దేశానికి తెలియజేస్తుండగా ,మరికొందరు టీవీ తెరవెనుక ఏడుస్తున్నట్లు విన్పించింది.