
అఫీషియల్ ప్రీమియర్‌కి ముందే జియోహాట్‌స్టార్ రూపొందిస్తున్న కొత్త రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్’ ఇప్పటికే భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. షో చిత్రీకరణ జరుగుతున్న గ్రాండ్ లొకేషన్ లవ్ మాన్షన్ లోపలి ఆసక్తికరమైన చిత్రాలు బయటికి వచ్చాయి. ఈ విశాలమైన మాన్షన్‌లో ప్రస్తుతం 10 మంది సెలబ్రిటీ జంటలు 70 రోజుల ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రేమ, నమ్మకం, సహనం, భాగస్వామ్యాన్ని 24/7 కెమెరాల పర్యవేక్షణలో పరీక్షించే విధంగా ఈ లవ్ మాన్షన్‌ను డిజైన్ చేశారు. హిట్ మిషన్ అనిల్ రావిపూడి, హీరోయిన్స్ రాధ, లయ ఈ షోకి జ్యూరీగా వుండటం మరింత ప్రత్యేకతని తీసుకొచ్చింది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్నారు. తాజాగా మీడియా ప్రతినిధులకు ఈ షోకి సంబధించిన స్పెషల్ ప్రోమోని ప్రదర్శించారు.