Reading Time: < 1 minute

టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ(86) హతం అయ్యారు. ఖమేనీ నివాసం లక్ష్యంగా 30 మిసైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. యుఎస్, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ తో పాటు కుటుంబ సభ్యులు, ఇరాన్ రక్షణ మంత్రి అమీర్, నసీర్జాదే, రివల్యూషనరీ గార్డ్ ఆర్ జిఎస్ కమాండర్ మొహమ్మద్ కూడా మృతి చెందారు. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా నిర్థారించారు. ఖమేనీ మృతి పట్ల 40 రోజుల పాటు సంతాపదినాలు ఇరాన్ ప్రకటించింది. దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు మృతి చెందారు. రోడ్లపైకి వచ్చి ఇరాన్ పౌరులు సంబురాలు జరుపుకుంటున్నారు.