Reading Time: < 1 minute
Sahibzada Farhan Breaks Virat Kohli T20 World Cup Record Most Runs 2026

PAK vs SL: పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ శనివారం కీలక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకలో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఫర్హాన్ దంచికొడుతున్నారు. ఓపెనర్‌గా వచ్చిన ఫకర్ జమాన్ కూడా సుడిగాలి ఇన్సింగ్స్ ఆడాడు. అయితే, ఫర్హాన్ 12 ఏళ్లుగా విరాట్ కోహ్లీ పేరిటి ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. పల్లెకెలేలో శ్రీలంకలో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో ఫర్హాన్ ఈ ఘనత సాధించాడు.

ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ పేరిటి ఉన్న రికార్డ్ ఇప్పుడు ఫర్హాన్ పేరు మీదకు మారింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల మార్క్ చేసుకున్న తర్వాత కోహ్లీ పేరిటి 2014లో ఉన్న రికార్డును అధిగమించాడు. 2014 T20 ప్రపంచ కప్ లో కోహ్లీ ఆరు మ్యాచ్ ల్లో 319 పరుగులు చేశాడు, ఇది 12 సంవత్సరాలుగా ఉన్న రికార్డు. ఇప్పుడు, సాహిబ్జాదా ఫర్హాన్ 2026 టోర్నమెంట్ లో 320 పరుగుల మార్కును అధిగమించాడు.  శ్రీలంకతో మ్యాచ్‌లో 59 బాల్స్‌లోనే ఫర్హాన్ 100 రన్స్ చేశాడు.

ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు (T20 ప్రపంచ కప్)

1. సాహిబ్‌జాదా ఫర్హాన్ (పాకిస్తాన్) – 320* పరుగులు (2026)
2. విరాట్ కోహ్లీ (భారతదేశం) – 319 పరుగులు (2014, 6 మ్యాచ్‌లు)
3. తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) – 317 పరుగులు (2009, 7 మ్యాచ్‌లు)
4. బాబర్ అజామ్ (పాకిస్తాన్) – 303 పరుగులు (2022, 6 మ్యాచ్‌లు)
5. మహేల జయవర్ధనే (శ్రీలంక) – 302 పరుగులు (2010, 6 మ్యాచ్‌లు)

2022లో బాబర్ అజామ్ 303 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ రికార్డుకు దగ్గరగా వచ్చాడు, కానీ దానిని అధిగమించలేకపోయాడు. ఇప్పుడు ఫర్హాన్ ఈ ఘనత సాధించాడు.