Reading Time: < 1 minute

మున్సిపల్ ఎన్నికలు..మేడ్చల్ లో వెండి కాయిన్లు పంపిణీ చేసిన బీజేపీ అభ్యర్థి

Caption of Image.

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల చెదురుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.

అయితే పలు చోట్ల పోలింగ్ బూత్ ల దగ్గర కూడా బీఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులను ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.  మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ లల్గాడి మలక్ పేట  5వ వార్డులో బీజేపీ నేతలు  ఓటర్లకు వెండి కాయిన్స్ పంపిణీ చేస్తున్నారు.  వెండి కాయిన్ల ఆశ చూపెడుతూ ఓటర్లను ప్రలోబ పెడుతున్నారు.

అనంతరం  మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అలియాబాద్ మున్సిపల్ పరిధి లాల్ గడిమలక్ పేట్ లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి. సమస్యాత్మక గ్రామం కావడంతో భద్రతపై ఆరా తీశారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పోలీస్ తెలిపారు. 

►ALSO READ | సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. ప్రైవేట్ స్కూల్ భవనంలో చెలరేగిన మంటలు

అంతకుముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ కొనసాగుతుండగా డబ్బుల కట్టలు కలకలం రేపాయి. 22వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవికి చెందిన ఓ వ్యక్తి ఓటర్ డబ్బు పంచుతుండగా పోలీసులు పట్టుకునేందు ప్రయత్నించారు. దీంతో పరారైన అతడిని  పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు.  సుమారు లక్ష రూపాయల డబ్బు స్వాధీనం చేసుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
 

©️ VIL Media Pvt Ltd.