Reading Time: < 1 minute

మాదాపూర్ హైటెక్స్ జంక్షన్ దగ్గర కారులో మంటలు… ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంలో…

Caption of Image.

హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్స్ జంక్షన్ దగ్గర కారులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. సాయంత్రం అంతా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మంగళవారం ( ఫిబ్రవరి 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి విరాలిలా ఉన్నాయి.. 

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ జంక్షన్ నుంచి హైటెక్స్ జంక్షన్ దగ్గరికి వచ్చే దారిలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగడంతో కారు ముందు భాగం పూర్తిగా దగ్దమైంది. ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది వచ్చేలోపే కారు ముందు భాగం పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో మంటలు చెలరేగడానికి కారణం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. 

©️ VIL Media Pvt Ltd.