Reading Time: < 1 minute

మీ పిల్లలు సైలెంటుగా ఉంటున్నారా ? తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే !

Caption of Image.

అనుకోని ప్రమాదాలు, విషాదాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి. దాంతో మానసిక ఒత్తిడికి గురవుతారు. చాలామంది తల్లిదండ్రులు, పిల్లల మీద వీటి ప్రభావం ఏముంటుందిలే అనుకుంటారు. నిజానికి పెద్దోళ్ల కన్నా చిన్న పిల్లలపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మరణం కావొచ్చు. భూకంపాలు కావొచ్చు. బాగా చదివినా కూడా పరీక్షల్లో వెనుకపడొచ్చు. ఇవన్నీ పసిపిల్లల మనసును ఇబ్బంది పెడతాయి. దాంతో ఒత్తిళ్లకు లోనవుతారు. పిల్లల ఆలోచనలు మారతాయి. 

ఒంటరితనం, నిరాశ నిస్పృహలు దరిచేరతా యి. హుషారుగా ఉండాల్సిన పిల్లలు నిస్సాహయ స్థితికి చేరతారు. ఇలాంటి సమయంలో పిల్లలకు పెద్దల సానుభూతి అవసరం. పిల్లలను గమనించి ‘నీకేమి కాదు.. మేమున్నాం’ అనే భరోసా ఇవ్వాలి. మానసిక స్థితి ఎంటో తెలు సుకొని ‘అనవసరమైన ఆలోచనలు చేస్తున్నావు. అసలు సమస్యే కాదనే’ మాటలు చెబుతూ ఉండాలి. పిల్లల్లో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. తల్లిదండ్రులు గుర్తించి.. ఆ దిశగా ప్రోత్సహించాలి. వాళ్ల సామర్థ్యాలేంటో తెలిపి ఆత్మవిశ్వాసం నింపాలి. 

పిల్లలకు ఇష్టమైన ప్రాంతాలు తెలుసుకొని తీసుకెళ్తుండాలి. ఇష్టమైన ప్రదేశాల్లో ఆనందంగా గడ పుతారు. దాంతో మానసిక ప్రశాంతత వస్తుంది.ఒంటరిగా ఉన్నట్లు కనిపిస్తే.. పిల్లలకు ఇష్టమైన ఆటలను పరిచయం చేయాలి. ఆటలవైపు మనసు మళ్లిస్తే ఆందోళన, భయం కొంతవరకు తగ్గుతా యి. తీవ్రంగా మనసు గాయపడిన పసి హృదయాలు అంత త్వరగా కోలుకోవు. కాబట్టి డాక్టర్లను స్పందించి కౌనెల్సింగ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి.

©️ VIL Media Pvt Ltd.