Reading Time: < 1 minute

హిందుస్థాన్ యూనిలివర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Caption of Image.

నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రం సమీపంలోని హిందుస్థాన్ యూనిలివర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమ వెనకలా వేసిన స్క్రాప్కు అనుకోకుండా.. అకస్మాత్తుగా నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి భారీ నష్టం జరగలేదు.

రంగారెడ్డి జిల్లా షాద్‌‌నగర్‌‌ పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న ట్రెండ్స్‌‌ షాపింగ్‌‌ మాల్‌‌లో కూడా మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. షాపు సెల్లార్‌‌లోని జనరేటర్‌‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో జనరేటర్‌‌తో పాటు సెల్లార్‌‌లో నిల్వ ఉంచిన స్టాక్‌‌ అగ్నికి ఆహుతైంది. ఫైర్‌‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో ఉన్న సదరన్ రెస్టారెంట్‌‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. కిచెన్‌‌లో వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, రెస్టారెంట్ స్టాఫ్, స్థానికులు మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.