
తెలుగు చిత్ర పరిశ్రమలో నెగిటివ్ రివ్యూల ప్రభావంపై విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “బతుకు బతకనివ్వు, అందరూ కలిసి ఎదగాలి” అనే కాన్సెప్ట్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. డియర్ కామ్రేడ్ సమయంలో చూసిన కొన్ని రాజకీయాల వల్ల నిద్రలేని రాత్రులు గడిపానని, తన అప్పటి బాధ ఇప్పుడు చాలా మందికి అర్థమవుతుందని విజయ్ పేర్కొన్నారు. సినిమాలను నెగిటివ్ రివ్యూలతో దెబ్బతీస్తున్న వారిపై పరిశ్రమలో తీవ్ర ఆందోళన నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ సినిమాకు బుక్ మై షోలో రేటింగ్‌లు, రివ్యూలను నిలిపివేయడంపై విజయ్ దేవరకొండ స్పందించారు.
మరిన్ని వీడియోల కోసం :