Reading Time: < 1 minute

పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై భారీగా వర్షపు నీరు..ట్రాఫిక్‌కు అంతరాయం

Caption of Image.

హైదరాబాద్ సిటీలో భారీ వర్షం కురిసింది. మంగళవారం(జూలై28) సిటీవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.  రోడ్లపై భారీ ఎత్తున వరద నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆఫీసులనుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో  వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెహదీపట్నంపరిధిలోని పీవీఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీరు నిల్వడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రి  నుంచి  ఆరామ్‌ఘర్ జంక్షన్ వరకు ఉన్న 11.6 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే PVNR Expressway పై భారీగా వరద నీరు నిలవడంతో   ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పిల్లర్ నం. 250 సమీపంలో ఇరువైపులా వాటర్ లాగింగ్  ఏర్పడింది.  దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు నీటినీ తొలగించే చర్యలు చేపట్టారు. వాహనదారులు అప్రమత్తంగా డ్రైవ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. 

మరోవైపు బాచుపల్లి ఫ్లైఓవర్ కిందకూడా భారీ ఎత్తున వరద నీరు నిలించింది. వర్షపు నీరు రోడ్డుపై నిల్వ ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మేడ్చల్ జిల్లా మేడిపల్లి ఎలివేటెడ్ కారిడార్ పరిధిలోని పిల్లర్ నంబర్ 96 దగ్గర జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన డీఆర్ ఎఫ్ టీం జనరేటర్లతో  నీటిని తొలగిస్తున్నారు.  

►ALSO READ | గచ్చిబౌలి ORR దగ్గర లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు విద్యార్థులు స్పాట్ డెడ్

©️ VIL Media Pvt Ltd.