Reading Time: < 1 minute
Hyderabad Heavy Rain Alert Today

Heavy Rain Alert: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా బాచుపల్లి, కుతుబుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, మేడ్చల్, గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్‌పల్లి, గుండ్లపోచంపల్లి, హకీంపేట్, షామీర్‌పేట్, తూర్కపల్లి, కండ్లకోయ, బౌరంపేట్, మల్లాంపేట్ తదితర ప్రాంతాల్లో కొద్దిసేట్లోనే భారీ వర్షం కురిసే అవకాశం ఉందనడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కుతుబుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, మేడ్చల్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం ప్రారంభమవ్వగా, రాబోయే గంటలో ఈ వర్ష ప్రభావం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.

నగరంలో మోస్తరు నుండి తీవ్రమైన వర్షాలు పడే సూచనలు ఉన్నందున ప్రజలు తమ ప్రయాణాలను తగిన విధంగా ప్రణాళిక వేసుకోవాలని అధికారులు కోరారు. సాయంత్రం వేళల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు డ్రైవింగ్ చేసేటప్పుడు, నీరు నిలిచే ప్రాంతాల గుండా వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.