
వెండితెరపై విలక్షణ నటనతో, కామెడీతో ప్రేక్షకులను అలరించిన కళాకారులు ఆపదలో ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తోటి నటుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ తన పెద్ద మనసును చాటుకునే చిరంజీవి, ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న ‘గబ్బర్ సింగ్’ నటుడు రమేష్ కుటుంబానికి ఆపద్బాంధవుడిగా నిలిచారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న రమేష్ చికిత్సకు చిరంజీవి సాయం చేశారు. ఆసుపత్రి వైద్యులతో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అంతేకాకుండా నటుడు రమేష్ భార్యకి రూ.3 లక్షల చెక్ని అందజేశారు.
కేవలం ఆర్థిక సహాయంతో సరిపెట్టకుండా, ప్రభుత్వ ఆరోగ్య బీమా ద్వారా తదుపరి వైద్య సేవలు అందేలా చూస్తామని చిరంజీవి భరోసా ఇచ్చి గొప్పమనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి మంచిమనసుకి ఇది మరో నిదర్శనం అని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
Megastar @KChiruTweets Garu extended ₹3 lakh towards Gabbarsingh actor Ramesh’s treatment after learning of his brain stroke and assured all possible support. Shri @NagaBabuOffl Garu also contributed ₹2 lakh.
Wishing him a speedy recovery. 🙏 pic.twitter.com/OmdW3gI4P3
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 26, 2026
నాగబాబు నుంచి రూ.2 లక్షల సాయం
చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు కూడా తన వంతు బాధ్యతగా రమేష్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ క్లిష్ట సమయంలో మెగా కుటుంబం అండగా నిలవడంతో రమేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. విలన్, కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రమేష్ ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సినీ జీవితంలోకి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు. అభిమానులు, సినీ ప్రముఖులు కూడా రమేష్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
►ALSO READ | OTT Thriller: మర్డర్ మిస్టరీతో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్.. ఓటీటీ థ్రిల్లర్ లవర్స్‌కు బెస్ట్ ఛాయిస్!
‘గబ్బర్ సింగ్’తో గుర్తింపు..
పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ (2012) ద్వారా రమేష్ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ‘గబ్బర్ సింగ్’లో ‘‘గబ్బర్ సింగ్ గ్యాంగ్’’ సభ్యుడిగా కనిపించిన ఆయన, ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌లో వచ్చే అంత్యాక్షరి కామెడీ ఎపిసోడ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఆ సినిమాలోని గ్యాంగ్ సభ్యులందరూ ప్రేక్షకులను నవ్వించడంతో ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నారు.
రమేష్ నటించిన సినిమాలు..
గబ్బర్ సింగ్ గ్యాంగ్ సభ్యుడిగా గుర్తింపుతో, రమేష్ వరుస అవకాశాలు సంపాదించారు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అనంతరం అత్తారింటికి దారేది సినిమాలో కూడా కాసేపు కనిపించారు. వీటితో పాటు టాలీవుడ్‌లో పలు చిన్న, మధ్యతరహా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ పాత్రల్లో నటించారు.