Reading Time: < 1 minute

Chennai Love Story Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు!

Caption of Image.

కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’(Chennai Love Story) బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.13.2 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, రెండో రోజు ఇండియాలో సుమారు రూ.2.82 కోట్ల నెట్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా తొలి రెండు రోజుల్లో సినిమా రూ.10.45 కోట్ల ఇండియా నెట్, రూ.16.62 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూలు చేసింది.

పెయిడ్ ప్రీమియర్స్ కలిపి మొత్తం రూ. 19.73 కోట్ల గ్రాస్ అందుకుంది. రెండో రోజు వసూళ్లు మొదటి రోజుతో పోలిస్తే 11% పెరగగా, వీకెండ్ ముగిసే నాటికి రూ. 30 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పాజిటివ్ టాక్, వీకెండ్ అడ్వాంటేజ్‌తో రెండో రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంటూ అలరిస్తుంది. సుమారు రూ.15 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం, ఇదే జోరు కొనసాగితే త్వరలోనే లాభాల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కథేంటంటే:

నివి (శ్రీ గౌరీ ప్రియ) అజయ్‌ (త్రిగుణ్‌) అనే అబ్బాయిని ప్రాణంగా ప్రేమిస్తుంది. తీరా పెళ్లి పీటలకు వచ్చేసరికి నివిని వదిలేసి త్రిగున్ వేరే అమ్మాయితో చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతాడు. ఇక ఆ బాధ తట్టుకోలేక నివి తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఇక ఇదే సమయంలో నివిని బాధలో నుంచి బయటపడేయడానికి తన ఫ్రెండ్స్ చెన్నైకి తీసుకెళ్లారు. అక్కడే అదే సమయంలో డైరెక్టర్ కావాలనే కలతో చెన్నైకి స్టీవెన్‌ శంకర్ (కిరణ్ అబ్బవరం) అనే కుర్రాడు వస్తాడు.

►ALSO READ | విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

అలా అనుకోకుండా నివి జీవితంలోకి స్టీవెన్ ఎంట్రీ ఇస్తాడు. మొదట విభేదాలతో మొదలైన వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అలా అంతా సవ్యంగా సాగుతోందనుకున్న టైంలోనే వారి జీవితాలను మార్చేసే ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంటుంది. ఆ సంఘటన ఏమిటి? చివరికి వారి ప్రేమ కథ ఎలాంటి ముగింపుకు చేరుకుంది? అనేదే మిగతా కథ. 

©️ VIL Media Pvt Ltd.