Reading Time: < 1 minute

విద్యార్థుల హక్కుల కోసం యువజన కాంగ్రెస్ పోరాటం : రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్

Caption of Image.

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాలకు ఓ కీలక ఘట్టమని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ అన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం యువజన కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని, ఈ విజయంతో అది మరోసారి రుజువైందని పేర్కొన్నారు. 

జంతర్ మంతర్ వేదికగా సాగిన విద్యార్థుల పోరాటానికి తాము పూర్తి మద్దతుగా నిలిచామని తెలిపారు. కేంద్ర మంత్రి రాజీనామా అనంతరం యువజన కాంగ్రెస్ నేతలు శనివారం విద్యార్థి లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయభాను చిబ్, ఎన్‌‌ఎస్‌‌యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.