తిన్న వెంటనే బాత్‌రూమ్‌కు వెళ్లాలనిపిస్తుందా?.. దీనికి కారణం ఇదే!
ఈరోజుల్లో భోజనం చేసిన వెంటనే చాలామందికి బాత్‌రూమ్‌కు వెళ్లాలనిపిస్తుంటుంది. మీలో కూడా ఇలా జరుగుతుందా? అసలు తిన్న వెంటనే కడుపులో కదలికలు ఎందుకు మొదలవుతాయి? ఇలా జరగడం మీ జీర్ణక్రియ చాలా వేగంగా ఉందనడానికి సంకేతమా? లేక ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా? ఈ అలవాటు వెనుక ఉన్న అసలు కారణాన్ని వైద్య పరిభాషలో ఏమంటారో, నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఏంటీ గ్యాస్ట్రోకొలిక్ రిఫ్లెక్స్?: తిన్న వెంటనే మలవిసర్జన చేయాలనిపించడాన్ని వైద్య పరిభాషలో ‘గ్యాస్ట్రోకొలిక్ రిఫ్లెక్స్’ (Gastrocolic reflex) అంటారు. మనం తిన్న ఆహారం పొట్టలోకి చేరిన వెంటనే, పాత ఆహారాన్ని బయటకు పంపమని శరీరం పేగులకు సంకేతాలు పంపుతుంది. ఇక ఇది శరీరం చేసే ఒక సహజమైన ప్రతిచర్య మాత్రమే తప్ప మీ జీర్ణక్రియ వేగంగా ఉందనడానికి రుజువు కాదు.
ఎప్పుడు ప్రమాదకరం?: ఒక్కోసారి ఇలా తిన్న వెంటనే బాత్‌రూమ్‌కు వెళ్లడం సాధారణమే కానీ, ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇక మీ మలవిసర్జన అలవాట్లలో అకస్మాత్తుగా ఏవైనా మార్పులు వచ్చినా లేదా సాధారణం కంటే ఎక్కువసార్లు వెళ్లాల్సి వచ్చినా మీ పేగుల ఆరోగ్యంలో ఏదో మార్పు వచ్చిందని అర్థం చేసుకోవాలి.

కారణాలు ఇవే కావచ్చు: రోజుకు ఒకటి నుంచి మూడు సార్లు మలవిసర్జన చేయడం సాధారణం. అయితే తరచూ ఈ సమస్య రావడానికి కేవలం మోషన్స్ లేదా మలబద్ధకం మాత్రమే కారణం కాదు. ఇక మనం తినే ఆహారపు అలవాట్లు, రోజువారీ శరీర శ్రమ, మానసిక ఒత్తిడి, వాడే మందులు లేదా ఓవర్-ది-కౌంటర్ సప్లిమెంట్లు కూడా మీ పేగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
ఇక తిన్న వెంటనే బాత్‌రూమ్‌కు వెళ్లడం అనేది శరీరంలో జరిగే ఒక సహజ ప్రక్రియ అయినప్పటికీ, అది మీ రోజువారీ జీవితాన్ని ఇబ్బంది పెడుతుంటే అస్సలు తేలికగా తీసుకోకండి. ఈ సమస్య మళ్లీ మళ్లీ వేధిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం మంచిది.
గమనిక: మీకు ఈ సమస్యతో పాటు కడుపునొప్పి, బరువు తగ్గడం, లేదా మలంలో రక్తం పడటం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ (జీర్ణక్రియ నిపుణులు)ను సంప్రదించి పరీక్షలు చేయించుకోండి.
The post తిన్న వెంటనే బాత్‌రూమ్‌కు వెళ్లాలనిపిస్తుందా?.. దీనికి కారణం ఇదే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.