Reading Time: 2 minutes
Kidney Failure: కిడ్నీ ఫెయిల్యూర్‌కు ముందు కనిపించే లక్షణాలు ఇవే.. మీలోనూ ఉన్నాయా..? చెక్‌ చేసుకోండి

మన మొత్తం శరీరంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి సరిగ్గా పని చేయకపోతే.. మనం జీవించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి మన శరీరం నుండి వ్యర్థాలను శుభ్రపరిచి, రక్తాన్ని వడపోస్తాయి. అయితే ఇవి క్షీణించే ముందు మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయడం పూర్తి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. కాబట్టి సరైన టైంలో వీటిని గుర్తించడం ద్వారా భారీ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి మూత్రపిండాలు చెడిపోయే ముందు మనలో కనిపించే లక్షణాలు ఏంటో చూద్దాం.

మూత్రపిండాల సమస్య వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే:

మూత్రంలో మార్పు: ఒకవేళ మీ మూత్రపిండాలు డ్యామేజ్ అవుతున్నాయంటే.. మీ బాడీలో మొదటి సంకేతం మీ మూత్రంలోనే కనిపిస్తుంది. మీ మూత్రంలో నురగ వచ్చినా, లేదా మూత్రవిసర్జన పెరగడం లేదా తగ్గడం, రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడం లేదా మూత్రంలో రక్తం పడటం వంటివి కనిపిస్తే ఇది మూత్రపిండాల సమస్యకు కారణం కావచ్చు. ప్రోటీన్ లీకేజ్ లేదా వడపోత ప్రక్రియ సరిగ్గా జరగకపోవడం వల్లే మీ బాడీలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

ఎక్కువ మంది చదివినది: వృద్దుడిని కుర్చీకి చుట్టేసి 4 గంటల పాటు నరకం చూపించిన నాగు పాము.. ఇదిగో వీడియో!

కాళ్లు, ముఖం వాపు: మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, శరీరంలో నీరు నిలిచిపోతుంది. దీనివల్ల పాదాలు, చీలమండలు, చేతులు లేదా ముఖం వాపుకు గురవుతాయి. ఉదయం నిద్రలేచినప్పుడు మీ కళ్ల కింద వాపు కనిపిస్తే అప్రమత్తంగా ఉండండి.

ఎప్పుడూ బలహీనంగా అనిపించడం: మూత్రపిండాల వైఫల్యం రక్తంలో మలినాలు పేరుకుపోవడానికి కారణమవుతుంది, దీనివల్ల అలసట వస్తుంది. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా నీరసంగా లేదా ఆయాసంగా అనిపించడం ఒక సంకేతం కావచ్చు.

చర్మం దురద, ఆకలి లేకపోవడం: రక్తంలో విషపదార్థాలు పెరగడం వల్ల చర్మం దురద వస్తుంది, ఇంకా వికారం, వాంతులు లేదా ఆకలి లేకపోవడం కూడా సాధారణంగా కనిపిస్తాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

ఎక్కువ మంది చదివినది: మైక్రోవేవ్ జిడ్డుగా మారిందా.. కిచెన్‌లో దొరికే వీటితో క్షణాల్లో కొత్త దానిలా మార్చండి.. ఎలా అంటే?

లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?

మీకు ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అలాగే రక్త, మూత్ర పరీక్షలు చేయించుకొని సమస్యను తెలుసుకోండి. బీపీ లేదా షుగర్ ఉన్న వ్యక్తులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరు నిత్యం వైద్యులను కలుస్తూ ఉండాలి. అలాగే ఉప్పు తక్కువగా తినడం, నీరు ఎక్కువగా తాగడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం చేయాలి. మన రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

ఎక్కువ మంది చదివినది: అరెరే ఇన్నాళ్లు తెలీదే.. సింక్‌ బ్లాకేజ్‌ను క్లీన్ చేయడం ఇంత ఈజీనా.. మీరూ ట్రై చేయండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.