July 11, 2026

Ashu Reddy: అషురెడ్డి ఎంగేజ్మెంట్ ఫొటోల వెనక అసలు విషయమిదే.. వీడియోతో బట్టబయలు చేసిన బిగ్‌బాస్ బ్యూటీ

Ashu Reddy: అషురెడ్డి ఎంగేజ్మెంట్ ఫొటోల వెనక అసలు విషయమిదే.. వీడియోతో బట్టబయలు చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
Reading Time: 2 minutes
Ashu Reddy: అషురెడ్డి ఎంగేజ్మెంట్ ఫొటోల వెనక అసలు విషయమిదే.. వీడియోతో బట్టబయలు చేసిన బిగ్‌బాస్ బ్యూటీ

బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అషురెడ్డి ఈ మధ్యన తరచూ వార్తల్లో నిలుస్తోంది. వ్యక్తిగత విషయాలు, ఆర్థిక వ్యవహారాలతో తరచూ ఈ ముద్దుగుమ్మ పేరు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటుంది. ప్రస్తుతం ధర్మేంద్ర అనే ఎన్నారై దగ్గర నుంచి రూ.9.5 కోట్లు తీసుకుందని చీటింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటోంది అషురెడ్డి. దీనికి సంబంధించి ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇదే కేసు విషయమై అషురెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, సోమవారం విచారణకు హాజరవ్వాలని హైదరాబాద్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగానే అషూ రెడ్డి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. చేతి వేలిక ఉంగరం, మరో వ్యక్తి చేతిలో చేయి వేసి ఫొటోలని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మకు నిశ్చితార్థం జరిగిందని అంతా అనుకున్నారు. నెటిజన్లు కూడా ఈ ఫొటోలపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు స్వయంగా అషురెడ్డినే సమాధానమిచ్చింది. మరిన్ని ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచు కుంది.

బిగ్ బాస్ ఫేమ్ నిఖిల్ హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’. ఇందులో అషురెడ్డి కూడా ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సిరీస్ షూటింగ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలనే ఇప్పుడు అషురెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పైగా ‘మీరు చూసేదంతా, వినేదంతా నిజం కాదు’ అని క్రేజీ క్యాప్షన్ రాసుకొచ్చింది. గత ఫొటోల్లో అషురెడ్డితో కనిపించిన చెయ్యి మరెవరిదో కాదు బిగ్‌బాస్ 8 విజేత హీరో నిఖిల్ మళయక్కల్‌ది.

 ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ వెబ్ సిరీస్ షూటింగ్ లో బిగ్‌బాస్ 8 విజేత హీరో నిఖిల్ మళయక్కల్‌ తో అషూరెడ్డి..

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤ (@ashu_uuu)

నెటిజన్ల ట్రోలింగ్..

అషురెడ్డి షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే అషూరెడ్డిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘మీకు ఇది బాగా అలవాటైపోయింది’ అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤ (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..