
ఎక్కడైనా కొడుకు తప్పు చేస్తే మందలించే తండ్రులను చూస్తుంటాం.. కానీ కొడుకుతో కలిసి దోపిడీకి పాల్పడే తండ్రులను అరుదుగా చూస్తాం. అలాంటి స్టోరీనే ఇది. ఈ ఇద్దరు తండ్రీ కొడుకులు మామూలోళ్లు కాదు. తండ్రి యాక్షన్ అనగానే.. కొడుకు తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడు. తండ్రి డైరెక్షన్ లో నడిచిన ఈ స్టోరీలో 35 లక్షల రూపాయల దోపిడీ ఉంది. వివరాలేంటో చూద్దాం.
హైదరాబాద్ అంబర్ పేట్ కు చెందిన ఏ చంద్రశేఖర్ అనే యువకుడిని నిండా ముంచారు తండ్రీ కొడుకులు. నా కొడుకు ఆర్మీ మేజర్ అని తండ్రి ప్రచారం చేస్తుంటాడు.. తండ్రి డైరెక్షన్ లో కొడుకు ఆర్మీలో మేజర్ లా యూనిఫామ్ తో కనిపిస్తూ చేసిన యాక్షన్ కు సామాన్యులు నమ్మి బుట్టలో పడ్డారు.
►ALSO READ | భార్యతో గొడవ.. అత్తను బైక్పై తీసుకెళ్లిన అల్లుడు.. కట్ చేస్తే శవమై తేలింది !
హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ కి చెందిన కొడాలి శ్రీ సాయి అలియాస్ కార్తీక్.. అతని తండ్రి కొడాలి రవికుమార్ ఇద్దరూ కలిసి అంబర్ పేట్ చంద్రశేఖర్ దగ్గర 35 లక్షల 50 వేల రూపాయల మోసానికి పాల్పడ్డారు. ఆర్మీ మేజర్ అంటూ.. పెద్ద పెద్ద పరిచయాలున్నాయని నమ్మించారు. యూకే లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు కాజేశారు. యువకుడి నుంచి విడతల వారిగా 35.50 లక్షల రూపాయలు కొట్టేశారు.
డబ్బు చెల్లించిన అనంతరం ఉద్యోగం.. వీసా.. టికెట్లు ఇవ్వకుండా మోసం చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసాన్ని నిర్ధారించిన పోలీసులు తండ్రి రవికుమార్ ను హైదరాబాదులో అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు శ్రీ సాయి అలియాస్ కార్తీక్ గోవాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. స్పెషల్ టీమ్స్ ద్వారా ఆపరేషన్ మొదలుపెట్టారు. పక్కా స్కెచ్ తో గోవాలో నిందితుడిని అరెస్ట్ చేశారు . ఇద్దరి నుంచి రెండు మొబైల్ ఫోన్స్.. సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రీ, కొడుకులైన ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించారు