
సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించనున్నారు. 2026 మే 8వ తేదీన (శుక్రవారం) ఆయన కొడంగల్ లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్.
అదే విధంగా పట్టణంలో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసే బహిరగ సభకు హాజరై ప్రసంగించనున్నారు.