
Suvendu Adhikari: బెంగాల్‌లో బీజేపీ నేత సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య సంచలనంగా మారింది. ఈ హత్య బీజేపీ, టీఎంసీ మధ్య రాజకీయ వైరాన్ని మరింత పెంచాయి. అయితే, చంద్రనాథ్ రథ్‌కు ముందు సువేందు అధికారి వద్ద పనిచేసిన పలువరు సహాయకులు అనుమానాస్పదంగా మరణించారు.
2013లో సువేందు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో ఉన్న సమయంలో ఆయన వద్ద పీఏగా పనిచేసిన ప్రదీప్ ఝా, పూర్బ మేదినిపూర్ జిల్లాలో అనుమానాస్పదంగా మరణించారు. ఈ కేసు బెంగాల్ వ్యాప్తంగా రాజకీయ వివాదాన్ని రేకెత్తించింది.
Read Also: Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..
2018లో ఆయన వ్యతిగత భద్రతా అధికారి (పీఎస్ఓ)గా పనిచేసిన రాష్ట్ర సాయుధ పోలీస్ కానిస్టేబుల్ సుభబ్రత చక్రవర్తి, పూర్బ మేదినీపూర్ లోని కాంతిలో ఒక పోలీస్ బ్యాకర్‌లో శవమై కనిపించారు. చక్రవర్తి తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. అయితే, చక్రవర్తి భార్య ఈ మరణంపై అనుమానాలను వ్యక్తం చేశారు. 2021లో ఈ హత్యపై పశ్చిమ బెంగాల్ సీఐడీ దర్యాప్తును మళ్లీ ప్రారంభించింది. విచారణతో సంబంధం ఉన్న పలువురు పోలీసుల్ని ప్రశ్నించింది. ఈ హత్య బీజేపీ, టీఎంసీ మధ్య రాజకీయ ఘర్షణగా మారింది.
2021లో మరో వ్యక్తిగత సహాయకుడు(పీఏ) అసాధారణ పరిస్థితుల్లో మరణించారు. పులక్ లాహిరి 2021లో అనుమానాస్పదంగా మరణించారు. 2026లో చంద్రనాథ్ రథ్ హత్యకు గురయ్యారు. ఇది పక్కాగా ప్లాన్ చేసి హత్యగా బెంగాల్ పోలీసులు చెబుతున్నారు. ఈ హత్యపై దర్యాప్తును వేగవంతం చేశారు.