
హిందువులు అనేక సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు. మనిషి పుట్టుక నుంచి అంత్యక్రియల వరకు అనేకమైనవి ఉన్నాయి. మానవుడిది చివరిది అంత్యక్రియల సంస్కారం. దీనిని స్మశానంలో నిర్వహిస్తారు. సాధారణంగా శ్మశాన వాటికకు పురుషులే వెళతారు. స్త్రీలను అనుమతించరు. మహిళలు శ్మశాన వాటికకు వెళ్లకపోవడానికి గల కారణాలను గరుడపురాణంలో విశదీకరించారు. స్త్రీలు ఎందుకు స్మశాన వాటికకు వెళ్లకూడదు..వెళితే ఏం జరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హిందువులు ఎన్నో రకాల సంస్కృతి సంప్రదాయాలను, సంస్కారాలను పాటిస్తూ ఉంటారు. మనిషి తుదిశ్వాశ విడిచిన తరువాత ఆత్మ ఉత్తమ లోకాలకు వెళ్లేందుకు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. సాధారణంగా మగవారే ఈ కార్యక్రమాలను చేస్తారు. అలా పురుషులు చేసేటప్పుడు మహిళలు స్మశాన వాటికకు రాకూడదని గరుడ పురాణం ద్వారా తెలుస్తుంది. అయితే కొడుకులు లేనప్పుడు కుమార్తెలు చేసే దహన సంస్కారానాని అనేక ప్రాయశ్చిత్తాలు చేయాల్సి ఉంటుంది.
ఒక వ్యక్తి చనిపోయినప్పుడు గుండెపగిలేలా కుటుంబసభ్యులు ఏడుస్తుంటారు. పురుషుల కన్నా స్త్రీల మనస్సు సున్నితమైనది. బాధని పురుషుడు గుండెల్లో దాచుకుంటే స్త్రీలు ఏడుపు రూపంలో బయటకు వ్యక్తం చేస్తారు. అయితే శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్లిన తర్వాత కూడా మహిళలు వచ్చి అక్కడ రోదిస్తే ఆత్మకు శాంతి కలగదట. ఏడుపు విని ఆత్మలు కూడా రోదిస్తాయట. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల చితిని తగులబెట్టినప్పుడు ఎముకలు దహనం అవుతుండగా భారీ శబ్దం వస్తుంది. ఈ శబ్దాలకు మహిళలు, పిల్లలు భయపడతారని గరుడ పురాణం ద్వారా తెలుస్తుంది. దీనినే కపాలమోక్షం అంటారు.
దహన సంస్కారాలు జరిగిన తర్వాత కూడా కొన్ని ఆత్మలకు శాంతి లభించదని, అవి తిరుగుతూనే ఉంటాయని చెబుతారు. అలాంటి ఆత్మలు స్త్రీల శరీరంలోకి సులువుగా ప్రవేశిస్తాయట. అందుకే స్త్రీలను శ్మశానంలోకి అనుమతించరు.స్మశానంలో మరణించిన వారిని దహనం చేసేటప్పుడు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ భావోద్వేగానికి గురవుతారు. భయంకరమైన దృశ్యాలను చూసిన వారు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం కలదు. అందుకే అంత్యక్రియల సమయంలో శ్మశానవాటికకు వెళ్లిన పురుషులు తిరిగి వచ్చాక స్నానమాచరించి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అప్పటి వరకూ మహిళలు ఇంట్లోనే ఉండాలి..
తలనీలాలు తీసే సంప్రదాయం
హిందూ విశ్వాసాల ప్రకారం కుటుంబంలోని వారు చనిపోయినప్పుడు, కర్మలు చేసినప్పుడు పురుషులు గుండు చేయించుకుంటారు. చేయించుకోవాలి కూడా. స్త్రీలు ఈ నియమం పాటించలేరు. అంత్యక్రియలు మహిళలు చేయకూడదని చెప్పడం వెనుక ఇది కూడా ఒక కారణమని గరుడపురాణంలో ఉందని పలువురు పండితులు అంటున్నారు.. భారతీయ సంస్కృతిలో, మహిళలు జుట్టు కత్తిరించుకోవడం అశుభంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ నియమాన్ని పాటించడానికి మహిళలను కూడా స్మశానాలకు దూరంగా ఉంచుతారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.