
Sunrisers Hyderabad vs Punjab Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గత ఓటమికి పగ తీర్చుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ టార్గెట్ చేరుకోలేకపోయిన పంజాబ్ 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.
పంజాబ్ తరపున కూపర్ కానలీ 80 పరుగుతలో టాప్ స్కోరర్‌గా నిలవగా, మార్కస్ స్టోయినిస్ 28, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 5, ప్రియాంశ్ ఆర్య 1, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 3 పరుగులు చేశారు.
హైదరాబాద్ తరపున 2 హాఫ్ సెంచరీలు..
హైదరాబాద్ తరపున హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ అర్ధశతకాలు నమోదు చేశారు. క్లాసెన్ 43 బంతుల్లో 69 పరుగులు చేయగా, ఇషాన్ 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అలాగే, క్లాసెన్, నితీష్ రెడ్డి (29*) నాలుగో వికెట్ కు 63 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ (35), ట్రావిస్ హెడ్ (38) ఓపెనింగ్ భాగస్వామ్యానికి 55 పరుగులు జోడించారు. పంజాబ్ తరపున లాకీ ఫెర్గూసన్, విజయకుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
తుది జట్లు..
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, ఆర్ స్మరన్, నితీష్ రెడ్డి, పాట్ కమిన్స్ (సి), శివంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్ మరియు ఇషాన్ మలింగ.
ఇంపాక్ట్ ప్లేయర్స్: అనికేత్ వర్మ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సన్, లాకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: ప్రియాంష్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్.