July 15, 2026

GodOfWar : గెట్ రెడీ టైగర్స్.. ‘గాడ్ ఆఫ్ వార్’ వస్తున్నాడు

GodOfWar : గెట్ రెడీ టైగర్స్.. ‘గాడ్ ఆఫ్ వార్’ వస్తున్నాడు
Reading Time: < 1 minute
God Of War Trivikram Planning A Special Announcement Video For Jr Ntrs Birthday

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో భారీ చిత్రం రాబోతుంది. ఇన్నాళ్లు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఆ హైప్ ను మరింత పెంచుతూ  ప్రాజెక్ట్‌కు సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ సినిమాకు GodOfWar అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.  

మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేయాలని త్రివిక్రమ్ అండ్ టీమ్ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే సన్నాహాలు కూడా మొదలయ్యాయి. ఈ వీడియో ద్వారా సినిమా కాన్సెప్ట్‌ను లేదా ఎన్టీఆర్ లుక్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే ఈ వీడియో విడుదల అనేది పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ హై స్టాండర్డ్ వాల్యూస్ తో రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే 20వ తేదీ లోగా విఫెక్ట్స్ పనులు ఫినిష్ చేసుకుని క్వాలిటీ  చెక్ చేసుకుని ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే  బర్త్ డే కానుకగా రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఒకవేళ ఏవైనా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైతే మాత్రం అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తో సరిపెట్టే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో మరియు త్రివిక్రమ్ కాంబో నుంచి రాబోతున్న ఈ ‘గాడ్ ఆఫ్ వార్’ అప్‌డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.