Reading Time: < 1 minute

హైదరాబాద్ లో మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్.. ఒకే రోజు 22 మోటార్లు సీజ్

Caption of Image.

హైదరాబాద్ లో  అక్రమ మోటార్లపై  జలమండలి అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.జలమండలి చేపట్టిన ‘మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్’లో భాగంగా వరుసగా రెండో రోజూ తనిఖీలు హోరెత్తాయి. కేవలం ఒక్కరోజులోనే ఏకంగా 22 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు.

హైదర్‌నగర్ వార్డులో మెరుపు దాడులు చేసిన అధికారులు 9 మోటార్లను సీజ్ చేశారు. ఇక రాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా నీటిని తోడేస్తున్న వారిపై విజిలెన్స్ బృందం సడెన్ డ్రైవ్ చేపట్టింది. గాయత్రి నగర్, జ్యోతి నగర్, ఇండోర్ స్టేడియం కాలనీల్లో నిర్వహించిన ఈ దాడుల్లో మరో 13 మోటార్లు పట్టుబడ్డాయి.

నేరుగా మోటార్లు బిగించి మొదటిసారి దొరికితే మోటార్‌ను సీజ్ చేస్తాం. రెండోసారి కూడా అదే తప్పు చేస్తే.. ఐదు వేల రూపాయల జరిమానాతో పాటు, క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హైదరాబాద్ జలమండలి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

©️ VIL Media Pvt Ltd.