Reading Time: 2 minutes

Allu Arjun: బాబోయ్.. బన్నీ-అట్లీ ‘రాకా’ కోసం డిస్ట్రిబ్యూటర్లు క్యూ.. నార్త్ ఇండియాలో రికార్డు స్థాయిలో పోటీ!

Caption of Image.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ఇప్పుడు సరిహద్దులు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ‘రాకా’ ( Raaka ) మూవీలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ కోసం సౌత్ ఇండియాలోనే కాకుండా.. నార్త్ బెల్ట్ లో  కూడా డిస్ట్రిబ్యూటర్లు తెగ ఎగబడుతున్నారు. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నారు.

హిందీ బెల్ట్‌లో ‘రాకా’ రికార్డులు..

‘పుష్ప: ది రైజ్’ సినిమాతో హిందీలో వంద కోట్ల క్లబ్‌లో చేరిన అల్లు అర్జున్.. ఆ తర్వాత వచ్చిన  దాని స్వీక్వెల్ ‘పుష్ప 2’తో ఏకంగా రూ. 812 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. ముఖ్యంగా బీహార్‌లోని పట్నాలో పుష్ప-2 ట్రైలర్ లాంచ్ చేసినప్పటి నుండి అక్కడి ప్రేక్షకులలో బన్నీ అంటే ఒక ఎమోషన్‌గా మారిపోయింది. ఇప్పుడు ‘రాకా’ చిత్రం కోసం బీహార్ డిస్ట్రిబ్యూటర్లు ఎన్నడూ లేని విధంగా భారీ ధరలకు థియేట్రికల్ హక్కుల కోసం పోటీ పడుతున్నారు. 

బన్నీపై నమ్మకంతోనే..

ఈ ‘రాకా’ చిత్రాల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. బన్నీకి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది. గతంలో వచ్చిన పుష్ప సృష్టించిన రికార్డులతో అల్లు అర్జున్ పై డిస్ట్రిబ్యూటర్లకు అపారమైన నమ్మకం ఏర్పాడింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఫుష్ప’ సీక్వెల్ ను మించి ‘రాకా ‘ రికార్డులు కొట్టడం ఖాయమని.. అందుకే ఈ సినిమా కోసం అంత డిమాండ్ అని ఏర్పడించడని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

అదిరిపోయే కాస్టింగ్..

అల్లు అర్జున్ 22వ సినిమాగా (AA22), అట్లీ 6వ చిత్రంగా (A6) ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, ‘రాకా’ అనే టైటిల్‌తో అనౌన్స్ అయినప్పటి నుండి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇందులో బన్నీ సరసన బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె నటిస్తుండటం అంచనాలు మరింత పెంచేసింది. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫుల్ ధీమా ఉన్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ మేనరిజమ్స్ తోడైతే థియేటర్లలో పూనకాలేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మునుపెన్నడూ చూడని విధంగా..

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కూడా ఇటీవల ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అట్లీ అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. భారతీయ వెండితెరపై ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది అని ప్రశంసించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2027లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, అట్లీ సినిమాల్లో ఉండే బలమైన ఎమోషన్ ‘రాకా’లో కూడా హైలెట్‌గా ఉండబోతోందని సమాచారం. బీహార్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో మూతపడిన థియేటర్లను కూడా అల్లు అర్జున్ సినిమాలు తిరిగి తెరిపించాయంటే, ‘రాకా’ రేపు ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ఊహించుకోవచ్చు. ఏది ఏమైనా, ఐకాన్ స్టార్ తన గ్లోబల్ బాక్సాఫీస్ వేటను ‘రాకా’తో మరో మెట్టు పైకి తీసుకెళ్లడం ఖాయం అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

©️ VIL Media Pvt Ltd.