July 17, 2026

Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?

Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
Reading Time: < 1 minute
India Vs Pakistan Train Speed Comparison

Train Speed In Pakistan: భారత రైల్వే వ్యవస్థ మరింత అధునాతనంగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా హై స్పీడ్ రైళ్ల సంఖ్యను పెంచుతున్నారు. భారత్‌లో అత్యధిక వేగంతో ప్రయాణించే రైలుగా ‘‘ వందే భారత్’’ పేరు తెచ్చుకుంది. వందే భారత్ మాత్రమే కాకుండా గతిమాన్ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ వంటి రైళ్లు వేగంగా ప్రయాణిస్తాయి. అయితే, భారత్ కన్నా ఒక రోజు ముందు స్వాతంత్య్రం సాధించిన పాకిస్తాన్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎప్పుడో బ్రిటీష్ వారు నిర్మించిన పట్టాలపైనే అక్కడి రైళ్లు నడుస్తున్నాయి. ఎలక్ట్రిక్ రైల్వే రైళ్లు లేనే లేవు.

Read Also: AP Education Department: టీచర్‌ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్‌ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!

భారత్‌లో 68000 కి.మీ రైల్వే నెట్వర్క్ ఉంటే, పాకిస్తాన్‌లో 7800 కి.మీ రైల్వే నెట్వర్క్ ఉంది. పాకిస్తాన్ రైళ్ల సగటు వేగం గంటకు 60-70 కి.మీ కాగా, లాహోర్-రావల్పిండి మార్గంలో గంటకు రైళ్లు గంటలకు గరిష్టంగా 65 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. పాకిస్తాన్‌లో అత్యంత వేగవంతమైన రైలుగా ‘‘కారకోరం ఎక్స్‌ప్రెస్’’గా పరిగణిస్తారు. దీని గరిష్ట వేగం గంటలకు 105 కి.మీ. ఈ రైలు కరాచీ-లాహోర్ మధ్య నడుస్తుంది. పాకిస్తాన్ కొన్ని ట్రాక్స్‌లో గరిష్ట వేగం గంటకు 120 కి.మీ అయినప్పటికీ, చాలా రైళ్లు దీని కన్నా తక్కువ వేగంతోనే నడుస్తాయి. పాకిస్తాన్‌లో గ్రీన్ లైన్ ఎక్స్‌ప్రెస్ వేగవంతమైన, అత్యంత విలాసవంతమైన రైలుగా పరిగణిస్తారు. ఇది కరాచీ నుంచి లాహోర్ మధ్య 13 గంటల్లో ప్రయాణిస్తుంది.

ఇక భారత్‌లో రైళ్ల వేగం, ఆధునీకీకరణతో పోలిస్తే పాకిస్తాన్ బాగా వెనుకబడి ఉంది. భారత్‌లో వందేభారత్ రైలు గరిష్ట వేగం గంటకు 180 కి.మీ. అయితే, ఇది ఇప్పటి వరకు గంటకు 130 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంది. సాధారణంగా గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.