సమ్మర్లో చాలా మంది మహిళలు, అమ్మాయిలు ఎండ వేడి నుంచి రక్షణ పొందడానికి ముఖాలకు స్కార్ఫ్ లేదా ఏదైనా క్లాత్‌తో కప్పుకోవడం చూస్తుంటాం. చాలా మంది ఇలా చేయడం వలన చర్మాన్ని రక్షించుకుంటున్నాం అనుకుంటారు. కానీ ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందంట. అవి ఏవి అంటే?
మీరు ఎండ వేడికి మీ ముఖాన్ని క్లాత్‌తో కప్పివేయడం వలన మీ ముఖంపై ఉన్న చెమట, దుమ్ము అన్నీ చర్మంలోనే చిక్కుకపోతాయి. దీంతో బ్యాక్టీరియా మొత్తం చర్మంపై ఉండే రంధ్రాలను మూసి వేస్తుంది. దీంతో ముఖం జిడ్డుగా తయారు అవుతుంది. అంతే కాకుండా ఇది మొటిమలు, నల్లమచ్చలు వంటి సమస్యలకు కారణం అవుతుంది.
చర్మం నిగారింపుగా ఉండాలి అంటే తప్పకుండా దానికి కాంతి, గాలి అవసరం. అయితే మీరు చర్మాన్ని స్కార్ఫ్ తో కప్పివేయడం వలన చర్మం సరిగ్గా గాలిని తీసుకోలేదు. దీంతో ఇది చర్మంపై కాంతిని కోల్పోయి, ముఖం చాలా డల్‌గా కనిపిస్తుంటుంది. అందువలన ఎప్పుడూ కూడా ముఖానికి సహజ ఆక్సిజన్ అవసరం కాబట్టి, చల్లని గాలి తగిలేలా చేయాలి.
మీరు స్కార్ఫ్ శుభ్రం చేయకుండా, చాలా రోజులు వాడటం వలన దానిలో ఉన్న మురికి, చెమట , బ్యాక్టీరియా మీ ముఖంలోకి చేరుతుంది. దీంతో చర్మ సమస్యలు ఏర్పడుతాయి. ముఖ్యంగా మొటిమలు, దుద్దర్లు, అలర్జీవంటి సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
అలాగే సమ్మర్లో సహజంగానే చెమట అనేది ఎక్కువగా పడుతుంది. అయితే మీరు స్కార్ఫ్ వాడటం వలన ఇది తీవ్రతరం అవుతుంది. దీని వలన వేడి క్లాత్‌లో చిక్కుకపోయి, చెమటగా మారి, చర్మంలోకి వెళ్తుంది. దీంతో చర్మం జిగటగా, దుద్దర్ల , చికాకు, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు ఎదురు అవుతాయి




