Reading Time: 2 minutes
Shruti Haasan: ఇద్దరితో బ్రేకప్.. పెద్దలు కుదిర్చిన పెళ్లికి రెడీ అవుతోన్న శ్రుతి హాసన్! వరుడు ఎవరంటే?

లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రుతి హాసన్. హీరోయిన్ గా తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. కేవలం నటిగానే కాకుండా, సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గానూ సత్తా చాటింది. అయితే ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదీ అందాల తార.చివరిసారిగా రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ అయితే ప్రకటించలేదు శ్రుతి హాసన్. అయితే సినిమాలు కాకుండా ఈ మధ్యన తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన రూమర్లు మరోసారి వైరలవుతున్నాయి. గతంలో లండన్‌కు చెందిన ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో శృతి డేటింగ్‌ చేసింది. అయితే ఏమైందో కానీ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతోనూ ప్రేమ వ్యవహారం కొనసాగించింది. కానీ అది కూడా బ్రేకప్ అయ్యింది.

 

ఈ నేపథ్యంలో ఇప్పుడు అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌కి శ్రుతి హాసన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.పెద్దలు కుదిర్చిన వాడితోనే ఏడడుగులు నడిచేందుకు రెడీ అయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె కోసం వరుడిని వెదికే పనుల్లో తండ్రి కమల్ హాసన్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సంబంధాలను చూశారని, అయితే పెద్దగా వర్కవుట్ అవ్వలేదని సమాచారం. వీలైనంత త్వరగా శృతి హాసన్‌కు పెళ్లి చేయాలని కమల్ హాసన్‌ రెడీగా ఉన్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కాగా శ్రుతి హాసన్ పెళ్లి వార్తలు వైరల్ కావడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాంటి వార్తలు రాగా అవన్నీ రూమర్లేనని తేలిపోయాయి. ఇప్పుడీ మళ్లీ శ్రుతి పెళ్లి వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఆకాశంలో ఒక తార సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది శ్రుతి హాసన్. తెలుగుతో పాటు తమిళం, కన్నడం మలయాళం హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.పవన్ సాధినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రుతి హాసన్ లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.