Reading Time: < 1 minute
Iran Appoints New Security Chief Mohammad Bagher Replaces Ali Larijani

దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కుడి భుజం.. ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి అలీ లారిజానీని ఇజ్రాయెల్ ఒక ప్రణాళికతో అంతమొందించింది. దీంతో ఇరాన్ అత్యున్నత పవర్‌ఫుల్ నాయకులను కోల్పోవల్సి వచ్చింది.

L

తాజాగా అలీ లారిజానీ స్థానాన్ని ఇరాన్ భర్తీ చేసింది. ఇరాన్ కొత్త భద్రతా అధిపతిగా మహమ్మద్ బఘేర్ జోల్ఘదర్‌ను నియమించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా మహమ్మద్ బఘేర్ జోల్ఘదర్‌ నియమితులైనట్లుగా ఇరాన్ ప్రభుత్వం తెలిపింది.

ఐఆర్‌జీసీతో జోల్ఘదర్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా నియామకం జరిగినట్లుగా తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతాకు సంబంధించిన నాయకత్వం అత్యంత ముఖ్యమైందిగా ఇరాన్ భావించింది. ఈ నేపథ్యంలో జోల్ఘదర్‌ నియామకం వేగంగా జరిగింది.

అలీ లారిజానీ..
అలీ లారిజానీ ఇరాన్‌లో అత్యున్నత పదవిలో ఉన్న ప్రముఖుడు. అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు. కుడి భుజం. అపారమైన అనుభవం ఉంది. వ్యవస్థలను సమర్థవంతంగా నడిపించగల సామర్థ్యం ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదింపులు జరపడంలో మంచి నైపుణ్యం ఉంది. ఇక అలీ లారిజానీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉంటారు. శత్రువుకు చిక్కకుండా రహస్య స్థావరాలు మారుతుంటారు. అలాంటిది ఇజ్రాయెల్‌కు చిక్కడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐడీఎఫ్ టార్గెట్ చేసి చంపేసింది. దీంతో ఇరాన్ భారీ షాక్‌కు గురైంది. ఈనెల 18న అలీ లారిజానీ, అతని కుమారుడు మోర్టెజా లారిజానీ, అతని భద్రతా సిబ్బంది హతమైనట్లుగా ఇరాన్ అధికారులు వెల్లడించారు.