Reading Time: < 1 minute
Ipl 2026 Injury List Star Players Ruled Out Big Setback For Teams Ahead Of Season

Ruled Out Players in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు ప్రాంచైజీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కొందరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. మరికొందరు కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ప్లేయర్స్ గాయాలు జట్ల వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఐపీఎల్ 2026 ముందు గాయపడిన ప్లేయర్స్ లిస్ట్ ఓసారి చూద్దాం.

ఐపీఎల్ 2026 ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా దూరమవగా.. శ్రీలంక స్టార్ బౌలర్ పతిరానా కూడా గాయంతో అందుబాటులో లేడు. ఈ ఇద్దరు స్టార్స్ అందుబాటులో లేకుండా పోవడంతో కేకేఆర్ బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఆడడం లేదు. ఇది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ కూడా గాయంతో తప్పుకున్నాడు.

న్యూజీలాండ్ పేసర్ లాకీ ఫెర్గ్యూసన్ వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2020లోని కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున ఫెర్గ్యూసన్ ఆడుతున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా దూరమవగా.. కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఇది సన్‌రైజర్స్ జట్టుకు పెద్ద లోటుగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి కూడా గట్టి షాక్ తగిలింది.

Also Read: TC Rajan Dead: పలమనేరు మాజీ ఎమ్మెల్యే రాజన్ కన్నుమూత.. నిరాడంబర జీవనానికి నిలువెత్తు నిదర్శనం!

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే బలహీనంగా కనిపిస్తున్న ఆర్సీబీ బౌలింగ్ విభాగాన్ని మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే కీలక ఆటగాళ్ల గాయాలు జట్ల సమతుల్యతను దెబ్బతీశాయి. ఈ లోటును జట్లు ఎలా భర్తీ చేస్తాయో, యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారో అన్నది ఈ సీజన్‌లో కీలకంగా మారనుంది.