Reading Time: < 1 minute

జనగణన వివరాలు చెప్పకుంటే రూ. వెయ్యి జరిమానా

Caption of Image.

తెలంగాణలో  రెండు దశల్లో జనగణన కొనసాగుతుందని సెన్సెస్ డైరెక్టర్ భారతి హోలికేరీ చెప్పారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటా యని తెలిపారు. సెన్సెస్ సిబ్బందికి ఎవరైనా వివరాలు చెప్పకుంటే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని అన్నారు. 16 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన చేపడుతున్నామని కనుక ప్రజలందరూ తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. 

జనగణన ఆధారంగానే ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటాయని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ తదితరాలన్నింటికీ జనగణనే కీలకమని తెలిపారు. తెలంగాణలో మే 11 నుండి జూన్ 9 వరకూ తొలివిడత, రెండోదశ జనగణన 2027 ఫిబ్ర వరి 9 నుంచి 28 వరకూ చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. తాజాగా ప్రారంభమైన సెన్సెస్-2027 ప్రక్రియలో ఎన్యూ మరేటర్ తన మొబైల్ ఫోన్లో వివరాలు సేకరిస్తారు. ప్రత్యేక యాప్/పోర్టల్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు స్వీకరిస్తారు. 

►ALSO READ | చరిత్ర సృష్టించిన తెలంగాణ విద్యుత్ శాఖ.. విద్యుత్ వినియోగంలో ఆల్ టైమ్ రికార్డ్

©️ VIL Media Pvt Ltd.