Reading Time: < 1 minute

హైదరాబాద్ పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు..బావిలో కుళ్లిపోయి ఇలా..అసలేం జరిగింది.?

Caption of Image.

హైదరాబాద్  పాతబస్తీలో దారుణం జరిగింది. మిస్సైయిన యువకుడు బావిలో శవమై కనిపించాడు.  మృతదేహం గుర్తు పట్టలేనంతగా..కుళ్లిపోయి అస్థిపంజరంలా మారింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు బావిలో నుంచి శవాన్ని  బయటకు వెలికితీయించారు.

అసలేం  జరిగిందంటే..హైదరాబాద్ పాతబస్తీలో మార్చి  4వ తేదీన  యువకుడు గౌతమ్ కుమార్(20) అనే వ్యక్తి అదృష్టమైనట్టు కుటుంబ సభ్యులు ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. మార్చి 13న  రాత్రి రాజన్న బావి సమీపంలో పులమ్మ బావిలో గుర్తు తెలియని మృతదేహాం ఉన్నదని స్థానికులు ఛత్రినాక పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిని   ఘటన స్థలానికి చేరుకుని ట్యాంక్ బండ్ శివ టీంతో మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు . పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడిది  హత్య లేక.. ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు  చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.