Reading Time: < 1 minute
Iran Drone Strike On Dubai Financial Building Viral Video

పశ్చిమాసియా యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. డ్రోన్‌తో దాడి చేయడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. దీంతో భారీగా పొగలు ఎగసిపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Gold-Silver Rates: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోయింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు సాగుతుండగా.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు సాగిస్తున్నాయి.