
సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో జీతాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల్లో జీతం, పోష్ లైఫ్ స్టైల్.. సాఫ్ట్ వేర్ రంగం వైపు మొగ్గు చూపడానికి ఇవే ప్రధాన కారణాలు. ఎక్స్ పీరియన్స్ పెరిగే కొద్దీ… పాకేజ్ రెట్టింపవుతున్న క్రమంలో ఫ్రెషర్ గా 3, 4 లక్షల ప్యాకేజ్ తో కెరీర్ మొదలైనప్పటికీ… నాలుగైదేళ్ళ తర్వాత ప్యాకేజ్ 20, 30 లక్షలకు చేరుతోంది. ఈ అవకాశాన్ని చాలా తెలివిగా వాడుకున్నాడు ఓ ఉద్యోగి. 21 లక్షల ప్యాకేజ్ ఉన్న ఆ ఉద్యోగి ఓ కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగా… రూ.28 లక్షల ప్యాకేజ్ అఫర్ చేసింది సదరు కంపెనీ. అందుకు ఆ ఉద్యోగి కూడా ఒప్పుకున్నాడు.. నోటీస్ పీరియడ్ చేసొచ్చి జాయిన్ అవుతానని చెప్పిన ఉద్యోగి కంపెనీ భారీ షాక్ ఇచ్చాడు.
తాను ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలో నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్న సమయంలో మరో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు సదరు ఉద్యోగి..ప్రస్తుతం తన చేతిలో ఉన్న రూ. 28 లక్షల అఫర్ ను చూపించి మరో కంపెనీతో రూ. 32 లక్షల ఆఫర్ దక్కించుకున్నాడు.. అక్కడితో ఆగని సదరు ఉద్యోగి సాఫ్ట్ వేర్ తెలివి చూపించాడు. తనకు వేరొక కంపెనీలో రూ. 32 లక్షల ఆఫర్ వచ్చిందని.. మీ కంపెనీలో రూ. 36 లక్షలు ఇస్తే జాయిన్ అవుతానంటూ మెయిల్ చేశాడు.
Interviewed a backend developer.
Guy was at 21 LPA. We offered 28 LPA, roughly a 33 percent hike. He agreed and confirmed joining.
Yesterday he emailed saying he got a 32 LPA offer elsewhere and now wants 36 LPA from us.
Nonsense. Why agree in the first place.
If you are… pic.twitter.com/3X4DqhiJyr
— Jasveer Singh (@jasveer10) March 11, 2026
►ALSO READ | లోక్ సభలో స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
రూ. 28 లక్షల ప్యాకేజ్ కి జాయిన్ అవుతానని చెప్పి ఆఫర్ యాక్సెప్ట్ చేసిన ఉద్యోగి.. జాయినింగ్ కి రెండు రోజుల ముందు ఈ రకంగా షాక్ ఇవ్వడంతో కంపెనీ కో-ఫౌండర్ అండ్ సీఈఓ షాక్ అయ్యాడు. తన ఆవేదన అంతా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. అయితే.. ఈ పోస్ట్ కి రకరకాలుగా రియాక్ట్ అవుతూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఇందులో ఆ ఉద్యోగి చేసిన తప్పేంటి..? ఎవరైనా పని చేసేది మంచి జీతం కోసమే కదా.. తనకున్న అవకాశాన్ని తను వాడుకున్నడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
బలవంతపు రిజిగ్నేషన్స్ తో లేఆఫ్స్ చేస్తున్నప్పుడు లేని నైతికత, విలువలు ఇలాంటప్పుడు గుర్తొస్తాయా అంటూ కామెంట్ చేస్తున్నారు మరికొంతమంది నెటిజన్స్. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో ఇలాంటివి తరచూ జరిగే జరిగే సంఘటనలే అయినప్పటికీ.. ఒక కంపెనీ సీఈఓ స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.