
కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకుంది. తిరువనంతపురంలోని ఒక ఆలయంలో మోనాలిసా మెడలో ఫర్మాన్ మూడు ముళ్లు వేశాడు. ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసం చేస్తు్న్న చీప్ స్టంట్ అనే ప్రచారం కూడా ఉంది. ఈ మధ్య ఇలా రియాల్టీ షోల ప్రోమో కోసం, సినిమా ప్రమోషన్ల కోసం పెళ్లిళ్లు చేసుకున్నట్లు తాళిని ఎగతాళి చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది.
Viral Kumbh Mela fame Monalisa Bhosle married boyfriend Farman Khan at a temple in Thiruvananthapuram.
Couple sought Kerala Police protection due to Monalisa’s family opposition. pic.twitter.com/dfmXWZDFd1
— Kreately.in (@KreatelyMedia) March 11, 2026
మోనాలిసా కూడా తన మలయాళ సినిమా ప్రచారం కోసం ఇలా చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లడం వల్ల నిజంగానే అతను ఆమె లవర్ అయి ఉండొచ్చని, పెళ్లి చేసుకుని ఉండొచ్చని ఈ పెళ్లి వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
Viral ‘Kumbh Mela girl’ Monalisa Bhosle got married with her boyfriend in a temple in Trivandrum, Kerala.
Kerala Story for you ❤️ pic.twitter.com/Dbhz7jlctN
— Aswin (@AswinTvm3) March 11, 2026
ఇంతకీ ఈ ఫర్మాన్ ఎవరంటే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసాకు ఏడాదిన్నర క్రితం మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ఫేస్ బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారు.
►ALSO READ | ‘వాళ్ళిద్దరి పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు’? విజయ్-త్రిష రిలేషన్‌పై ఖుష్బూ రియాక్షన్!
అయితే.. మతాంతర వివాహానికి మోనాలిసా తండ్రి ఒప్పకోలేదు. ఆమె ప్రేమ విషయం తెలిసి అప్పటి నుంచి మోనాలిసాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పుడు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మోనాలిసాపై ఒత్తిడి చేస్తుండటంతో ఆమె తన ప్రియుడితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆమె బుధవారం సాయంత్రం పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.