July 9, 2026

Ustaad Bhagat Singh: ‘కాలర్ ఎత్తరా’సాంగ్ ప్రోమో రిలీజ్.. జీరో కట్స్‌తో మాస్ జాతరకు పవర్ స్టార్ రెడీ!

Ustaad Bhagat Singh: 'కాలర్ ఎత్తరా'సాంగ్ ప్రోమో రిలీజ్.. జీరో కట్స్‌తో మాస్ జాతరకు పవర్ స్టార్ రెడీ!
Reading Time: 2 minutes

Ustaad Bhagat Singh: ‘కాలర్ ఎత్తరా’సాంగ్ ప్రోమో రిలీజ్.. జీరో కట్స్‌తో మాస్ జాతరకు పవర్ స్టార్ రెడీ!

Caption of Image.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం’ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.  గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్లీ రిపీట్ అవుతుందంటే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈనేపథ్యంలో లేటెస్ట్ గా  “కాలర్ ఏ ఎత్తరా” సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్..

కాలర్ ఎత్తరా.. 

ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ తాజాగా “కాలర్ ఏ ఎత్తరా” సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పవర్‌ఫుల్ బీట్స్‌కు పవన్ కళ్యాణ్ ఎనర్జీ తోడవడంతో ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రామ్ మిరియాల పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. ఫుల్ సాంగ్‌ను మార్చి 12న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.

 

జీరో కట్స్.. 

ఈ సినిమా పనులన్నీ శరవేగంగా పూర్తవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది.  సెన్సార్ వారు ఒక్క కట్ కూడా చెప్పకుండా ‘జీరో కట్స్’తో సినిమాను పాస్ చేశారు. ఇది అభిమానులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. గతంలో ‘ఓజి’ (OG) చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ రావడం వల్ల వసూళ్లపై కొంత ప్రభావం పడింది, కానీ ఇప్పుడు ‘ఉస్తాద్’ ఫ్యామిలీ ఆడియెన్స్ అందరినీ అలరించేలా క్లీన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోందని స్పష్టమవుతోంది. ఇక ఈ మూవీ రన్ టైమ్ మొత్తం 2 గంటల 29 నిమిషాలుగా ఉండనుందని సమాచారం.

 

భారీ తారాగణం..
మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఆర్. పార్థిబన్, అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, తమన్ బీజీఎం, దశరథ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి. మరి ‘గబ్బర్ సింగ్’ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ, ఈ మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి!

►ALSO READ | Rajendra Prasad: ఎంజీఆర్‌పై రాజేంద్ర ప్రసాద్‌అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాల్సిందేనని తమిళ తంబీల డిమాండ్!

©️ VIL Media Pvt Ltd.