Reading Time: 2 minutes

బిగ్‌బాస్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి మరణంతో కన్నీరుమున్నీరవుతున్న డీమాన్!

Caption of Image.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో తన ఆటతీరుతో, పోరాటపటిమతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా మరణంతో పోరాడుతున్న పవన్ తండ్రి, క్యాన్సర్‌ మహమ్మారి కారణంగా తుదిశ్వాస విడిచారు. ఈ వార్త విన్న అభిమానులు, బిగ్‌బాస్ సహచర కంటెస్టెంట్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.

క్యాన్సర్ తో పోరాడుతూ.. 

పవన్ తండ్రి గత కొంతకాలంగా నోటి క్యాన్సర్‌ (Oral Cancer) తో బాధపడుతున్నారు. బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న సమయంలోనే పవన్ తన తండ్రి ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ ఎన్నోసార్లు భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో తండ్రి కోలుకుంటున్నారని, క్యాన్సర్‌ను జయించారని అంతా భావించిన తరుణంలో ఈ విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. తండ్రి మరణవార్తను పవన్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, “నాన్న.. మీ ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉంటాయి” అని ఎమోషనల్ పోస్ట్ చేశారు.

బిగ్‌బాస్ ప్రయాణం

బిగ్‌బాస్ సీజన్ 9లో పవన్ ప్రయాణం ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది.  శారీరక బలం, మానసిక ధైర్యంతో టాస్కుల్లో తన ముద్ర వేశాడు. రెండుసార్లు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఫైనల్ వరకు వెళ్లే సత్తా ఉన్నా, తెలివిగా మాస్ మహారాజా రవితేజ ఆఫర్ చేసిన రూ. 15 లక్షల సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చాడు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తండ్రి వైద్యం కోసం అతను తీసుకున్న ఆ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంది. హౌస్‌లో రీతూతో ఉన్న బంధంపై విమర్శలు వచ్చినా, తన ఆటపై ఏమాత్రం ఏకాగ్రత కోల్పోలేదు.

►ALSO READ | Chiranjeevi : నాడు నా వేలు పట్టుకున్న చిన్నారి.. నేడు నాకే బ్లాక్‌బస్టర్ ఇచ్చింది.. కూతురిపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

 బిగ్‌బాస్ యాజమాన్యం పవన్‌ను సరిగ్గా గుర్తించలేదనే విమర్శలు ఉన్నప్పటికీ, జర్నీ వీడియోలో పవన్‌కు ఇచ్చిన ఎలివేషన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తండ్రిని దైవంగా భావించి, ఆయన కోసమే బిగ్‌బాస్ షోలోకి వచ్చి.. వచ్చిన ప్రతి రూపాయిని తండ్రి చికిత్స కోసం ఖర్చు చేసిన పవన్‌కు ఈ కష్టం తీరనిది. పవన్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని సన్నిహితులు, అబిమానులు కోరుకుంటున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.