July 9, 2026

Yami Gautam vs Kriti Sanon: బాలీవుడ్ హీరోయిన్స్ మధ్య సోషల్ వార్.. ఒక లైక్‌తో పెద్ద వివాదం!

Yami Gautam vs Kriti Sanon: బాలీవుడ్ హీరోయిన్స్ మధ్య సోషల్ వార్.. ఒక లైక్‌తో పెద్ద వివాదం!
Reading Time: 2 minutes

Yami Gautam vs Kriti Sanon: బాలీవుడ్ హీరోయిన్స్ మధ్య సోషల్ వార్.. ఒక లైక్‌తో పెద్ద వివాదం!

Caption of Image.

సినీ ప్రపంచంలో నటీనటులను అవార్డులు ఎంతటి ఉత్సాహాన్ని ఇస్తాయో.. ఒక్కోసారి అంతకంటే పెద్ద వివాదాలకు కూడా దారితీస్తుంటాయి. లేటెస్ట్ గా 2026 ‘జీ సినీ అవార్డ్స్’ వేదికగా బాలీవుడ్ భామలు యామీ గౌతమ్, కృతి సనన్ మధ్య ఒక ఆసక్తికరమైన సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఒక చిన్న ‘లైక్’ పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఇద్దరు అగ్ర నటీముణుల మధ్య రాజుకున్న ఈవివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివాదానికి కారణం ఇదే!
మార్చి 1, 2026న జరిగిన జీ సినీ అవార్డ్స్ వేడుకలో ‘తేరే ఇష్క్ మే’ చిత్రానికి గాను కృతి సనన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఇదే విభాగంలో ‘హక్’ సినిమాలో అద్భుత నటన కనబరిచిన యామీ గౌతమ్ కూడా నామినేట్ అయ్యారు. అయితే కృతికి అవార్డు రావడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో, కృతి గెలుపును విమర్శిస్తూ.. యామీ గౌతమ్ పాత ఇంటర్వ్యూ క్లిప్‌ను కలిపి ఎడిట్ చేసిన ఒక రీల్‌ను ఎవరో పోస్ట్ చేశారు.కృతి కంటే యామీనే ఈ అవార్డుకు అర్హురాలు అని అర్థం వచ్చేలా ఆ వీడియోలో ఉంది. ఈ నెగెటివ్ రీల్‌కు యామీ గౌతమ్ లైక్ కొట్టారు.  ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కృతి సనన్ విజయాన్ని యామీ అవమానిస్తోందని, ఆమెపై అసూయ పడుతోందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది .

యామీ గౌతమ్ రియాక్షన్ 
ఈ వివాదం అంతకంతకు ముదురుతుండటంతో యామీ గౌతమ్ వెంటనే ఇన్ స్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చారు. ఆ లైక్ వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించింది. మరో నటిని కించపరిచే రీల్‌ను నేను లైక్ చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ప్రతిరోజూ వందలాది పోస్ట్‌లలో మమ్మల్ని ట్యాగ్ చేస్తుంటారు. వాటిని చూసే క్రమంగా అనుకోకుండా ఆ రీల్‌పై క్లిక్ అయి ఉండవచ్చు. అంతే తప్ప కావాలని చేసింది కాదు  అని క్లారిటీ ఇచ్చారు.. తమపై వచ్చే క్లిక్ బైట్ వార్తలను నమ్మవద్దని, తను ఎప్పుడూ ఇలాంటి చీప్ పీఆర్ టెక్నిక్స్ఉపయోగించనని ఆమె స్పష్టం చేశారు.  కేవలం పనిపైనే దృష్టి పెడతానని ఆమె పేర్కొన్నారు.

నెటిజన్ల వాదన..
అయితే నెటిజన్లు మాత్రం రెండు వర్గాలుగా విడిపోయారు. ‘హక్’ సినిమాలో యామీ నటన లేదా ‘ఎమర్జెన్సీ’లో కంగనా రనౌత్ నటనకు అవార్డు రావాల్సిందని కొందరు వాదిస్తుండగా.. కృతి కూడా అద్భుతంగా నటించిందని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. ప్రస్తుతం యామీ గౌతమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్‌తో కలిసి ‘ధురంధర్ 2: ది రివెంజ్’ లో కీలక పాత్రలో కనిపించనుంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి ‘కాక్‌టెయిల్ 2’ తో పాటు ‘నో ఎంట్రీ 2’, ‘భేడియా 2’ వంటి భారీ చిత్రాల్లో కృతి సనన్ నటిస్తోంది. మొత్తానికి సోషల్ మీడియాలో ఒక చిన్న ‘లైక్’ బాలీవుడ్ అగ్ర నటీమణుల మధ్య కోల్డ్ వార్‌ను రాజేసింది. యామీ వివరణతో ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి!

 

 

©️ VIL Media Pvt Ltd.