Reading Time: < 1 minute

లెబనాన్‌లోని హెజ్‌బొల్లాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. సోమవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లాల టీవీ, రేడియో స్టేషన్లకు నష్టం వాటిల్లింది. దక్షిణ లెబనాన్‌లోకి మరిన్ని బలగాలను ఇజ్రాయెల్ తరలిస్తోంది. హెజ్‌బొల్లాలు స్థావరాల చుట్టూ ఉన్న 80 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించింది. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. 200మందికిపైగా గాయపడ్డారు. బీరూట్‌లోని దహియేలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించింది.