
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏ నిధులు రూ. 55 కోట్లు ఫార్ములా ఈ కార్ రేసింగ్‌కు కేబినెట్ ఆమోదం లేకుండా విదేశీ సంస్థకు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి.
ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ 77 పేజీల ఛార్జ్‌షీట్‌ను మార్చి 23న దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో మొత్తం 14 మంది సాక్షులను ఏసీబీ ప్రస్తావించింది.
కోర్టు ఈ ఛార్జీషీట్‌ను పరిగణనలోకి తీసుకుని, నిందితులకు సమన్లు జారీ చేసింది. కేటీఆర్ ఈ విచారణలో పాల్గొనడం ద్వారా తనపై ఉన్న ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. కోర్టు పరిసరాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి చర్యలు తీసుకున్నారు.