
Redmi K100 Pro Max: షావోమీ (Xiomi) సబ్-బ్రాండ్ రెడ్ మీ (Redmi) నుండి కొత్తగా Redmi K100 Pro సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని కాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఆగస్టు 11న ఈ సిరీస్‌ను చైనాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
అయితే ఈసారి Redmi K100 Pro, K100 Pro Max మోడళ్లను ముందుగా తీసుకురానుండగా.. సాధారణ Redmi K100 మోడల్‌ను తరువాత విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. గత తరాల మాదిరిగా మూడు మోడళ్లను ఒకేసారి విడుదల చేయకుండా, ఈసారి Redmi కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. Xiaomi ప్రెసిడెంట్ Lu Weibing ప్రకారం.. సాధారణ K100 మోడల్‌ను రద్దు చేయలేదని, అది కూడా తర్వాత లాంచ్ అవుతుందని తెలిపారు. కంపెనీ ప్రకారం, మెమరీ చిప్స్, ఇతర కంపోనెంట్ల ధరలు పెరగడంతో ఈ ఏడాది ఉత్పత్తి వ్యూహంలో మార్పులు చేశామని వెల్లడించింది.
Redmi K100 Proను సుమారు 4,000 యువాన్ (రూ.48,000) ధర విభాగంలో అన్ని విభాగాల్లో మంచి పనితీరు అందించే ఫ్లాగ్‌షిప్‌గా తీసుకురానున్నారు. ఇక Redmi K100 Pro Maxను ప్రత్యేకంగా గేమింగ్ ఫ్లాగ్‌షిప్ గా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. Geekbench లిస్టింగ్ ప్రకారం.. Redmi K100 Pro సిరీస్‌లో Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. ఇది భారీ పనితీరు, మెరుగైన AI సామర్థ్యాలు, తక్కువ పవర్ వినియోగంతో ప్రీమియం అనుభవాన్ని అందించనుంది. ఈ సిరీస్‌లో 6.59 అంగుళాలు, 6.9 అంగుళాలు అనే రెండు డిస్‌ప్లే ఆప్షన్లు ఉండనున్నాయి. రెండింటిలోనూ 185Hz ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. అలాగే కొత్త Super Pixel టెక్నాలజీ ద్వారా 1K స్థాయి పవర్ వినియోగంతో 2K తరహా విజువల్ క్లారిటీ లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
లీకుల ప్రకారం Redmi K100 Pro Maxలో:
* 200MP ప్రధాన కెమెరా
* 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (టెలీమాక్రో సపోర్ట్‌తో)
* 9,000mAhకు పైగా భారీ బ్యాటరీ
* 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
* 50W వైర్‌లెస్ ఛార్జింగ్
* 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* IP రేటింగ్‌తో వాటర్ రెసిస్టెన్స్
* సిమెట్రిక్ స్టీరియో స్పీకర్లు
* Bose ట్యూన్ చేసిన 2.1-ఛానల్ ఆడియో సిస్టమ్
వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ చైనాలో ఆగస్టు 11న లాంచ్ కానుంది. గ్లోబల్ మార్కెట్లో Redmi K100 Proను Poco F9 Pro, Redmi K100 Pro Maxను Poco F9 Ultra పేర్లతో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై Xiaomi నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.