Reading Time: < 1 minute

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మి మంగళవారం ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహిస్తున్న కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా మంత్రి సీతక్కను మంచు లక్ష్మి ఆహ్వానించారు. తాను స్థాపించిన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను మంత్రికి ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన కోసం తమ సంస్థ చేయూతగా నిలుస్తోందని మంచు లక్ష్మి మంత్రికి వివరించారు. అనంతరం మంచు లక్ష్మిని మంత్రి సీతక్క అభినందించారు.