
హోలీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధి పంతులు చెరువు లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.హోళీ పండగ అనంతరం స్నానం కోసం స్నేహితులతో కలిసి చెరువులోకి ఇద్దరు యువకులు దిగారు.లోతులోకి వెళ్లిన తర్వాత ఊపిరాడక నీటిలో మునిగి మృతి చెందారు. తోటి స్నేహితుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు వివరాలు అడగి తెలుసుకున్నారు. మృతులు సాగర్(17),అభిషేక్(17)పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకునిమృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.